జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ” రియో డి జనీరో జి 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాన మంత్రి జార్జియా మెలోనిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. మా చర్చలు రక్షణ, భద్రత, వాణిజ్యం మరియు సాంకేతికతలో సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై కేంద్రీకృతమై ఉన్నాయి. సంస్కృతి, విద్య మరియు ఇతర రంగాలలో సహకారాన్ని ఎలా పెంచుకోవాలో కూడా మేము మాట్లాడాము. భారతదేశం-ఇటలీ దేశాల మధ్య స్నేహం కోసం ఈ సమావేశం ఎంతో దోహదపడుతుంది” అని పోస్టులో ప్రధాని మోదీ రాశారు.