మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్‌లోని చంచల్గూడ మహిళల ప్రత్యేక జైలులో “ఖైదీల సంక్షేమ దినోత్సవం”గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన మేడ్చల్-మల్కాజ్గిరి సెషన్స్ జడ్జి వి.బాల భాస్కర్ రావు మాట్లాడుతూ, ఖైదీలకు చట్టపరమైన హక్కులు, కేసులపై అవగాహన కల్పించారు. ఖైదీలు తమ కేసుల పరిష్కారానికి న్యాయస్థానాలు అందించే ప్రయోజనాలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్.మురళి బాబు మాట్లాడుతూ, మహాత్మాగాంధీ అహింసను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు, ఎంబీబీఎస్, డీసీహెచ్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు జైళ్ల సూపరింటెండెంట్ టి.వెంకటలక్ష్మి శ్రీనాధ్ ప్రత్యేకించి హైదరాబాద్‌లోని మహిళల ప్రత్యేక కారాగారం చేపట్టిన అన్ని పురోగతిని ఎత్తిచూపుతూ వార్షిక నివేదికను అందించారు. బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సంధర్బంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలలో పాల్గొని విజేతలు బహుమతులు అందుకున్నారు. అధికారులు, సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎన్.శివకుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు.