నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు- శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం నుండి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కూరుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.