Thursday, August 14, 2025
spot_img

రావు బహదూర్ మెజెస్టిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

Must Read

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్, C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా తాజా చిత్రం ‘రావు బహదూర్‌’ను గర్వంగా ప్రజెంట్ చేస్తున్నారు. వర్సటైల్ యాక్టర్ సత్య దేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఇవి తెలుగు సినిమాలోని అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థలు. A+S మూవీస్ ఇంతకుమందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ మేజర్‌లో GMB ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పనిచేశాయి, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ విమర్శకుల ప్రశంసలు పొందిన ‘క’ కి మద్దతు ఇచ్చాయి. రావు బహదూర్ కథ నచ్చి మహేష్ బాబు, నమ్రత ప్రొడక్షన్‌లోకి వచ్చారు. మంచి కంటెంట్ ఉన్న కథలకు వీరి మద్దతు ఎప్పుడూ వుంటుంది. సక్సెస్ ఫుల్ బ్యానర్స్ కలిసి రావడంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన ప్రొడక్షన్ విలువలతో, వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నారు.

రావు బహదూర్ ఓ సైకలాజికల్ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, ఎడిటింగ్ వెంకటేష్ మహా. గొప్ప విజువల్స్, భావోద్వేగాలు, చరిత్రా-సంస్కృతి కలిపిన ప్రపంచాన్ని చూపించబోతున్నారు. తెలుగు కథ గ్లోబల్ ఆడియెన్స్ కోసం రెడీ అవుతోంది. ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్‌ను అరిస్టోక్రాటిక్ డ్రెస్‌లో, చుట్టూ నెమలి పించాలు, తీగలు, చిన్న చిన్న బొమ్మల మధ్య కనిపించడం చాలా క్యురియాసిటీని పెంచింది. ఆగస్టు 15న థియేటర్స్‌లో “నాట్ ఈవెన్ ఎ టీజర్” అనే స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 18న డిజిటల్‌లో వస్తుంది. దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ఇది ప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ.

సత్యదేవ్ మాట్లాడుతూ.. ఒక యాక్టర్‌గా, రావు బహదూర్ లాంటి సినిమా దొరకడం అరుదు. ప్రతి ఉదయం ఐదు గంటల మేకప్‌… నేను కేవలం నటించలేదు, నిజంగానే రావు బహదూర్‌గా బతికాను. ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమా పని చేస్తున్నారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ, స్మరణ్ సాయి సంగీతం, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. పవర్‌ఫుల్ ప్రొడ్యూసర్స్, విజనరీ డైరెక్టర్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్న హీరో ఇవన్నీ కలిపి రావు బహదూర్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో తెలుగు, మల్టిపుల్ లాంగ్వేజెస్ సబ్‌టైటిల్స్‌తో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS