రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో జడేజా తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి 6వ వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2021లో డబ్ల్యూటీసీ ప్రారంభమవ్వగా..ఇప్పటి వరకు 41 మ్యాచ్‌లు ఆడిన జడేజా 25.92 సగటుతో 132 వికెట్లు తీయడంతో పాటు 2000 ప్లస్ రన్స్ చేశాడు. మరే ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. డబ్ల్యూటీసీలో జడేజా ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో ఆరు సార్లు 5-వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో సెంచరీ దిశగా సాగిన జడేజాను జోష్ టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. 310/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(168 బ్యాటింగ్)తో పాటు వాషింగ్టన్ సుందర్ (1 బ్యాటింగ్) ఉన్నారు. తొలి సెషన్‌లో భారత్ 25 ఓవర్లు ఆడి ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది.