- నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01 నుండి రోడ్డు సేఫ్టీ అంశంపై స్పెషల్ డ్రైవ్ చెపడుతున్నారు. ఈ సందర్బంగా బుధవారం పాతబస్తీ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని ‘‘ఓ.ఎస్’’ ఫంక్షన్ హాల్‌లో రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ విషయంలో పోలీసు విభాగం ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలకు, వాహనదారులకు అవగాహన పెంచుతుందని తెలిపారు.
అంతేకాకుండా మోటార్ వేహికల్ యాక్ట్ 129 సెక్షన్ ప్రకారం, ద్విచక్రం వాహనం నడిపే వ్యక్తి, వెనుకల కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని అన్నారు. అనంతరం బండ్లగూడ శివారు ప్రాంతం మొగల్ కాలేజ్ ఏదురుగా వాహనాలను తనిఖీ చేసి, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్బంగా నగరరానికి చెందిన స్వచ్చంద సంస్థ ” ట్రాక్స్”ఆధ్వరంలో పలువురు వాహనదారులకు హెల్మెట్ అందించారు. ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్, స్థానిక ఠాణా ఇన్స్‌పెక్టర్ జే. శ్రీను నాయక్‌తో పాటు అధిక సంఖ్యలో వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.