Thursday, December 5, 2024
spot_img

రూ.1000 కోట్ల విలువైన భూమి ఖతం..

Must Read
  • చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్..
  • నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం..
  • పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు..
  • గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు..
  • ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు..
  • ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు
  • నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పెను సవాలుగా మారిన ఫోనిక్స్ నిర్మాణ సంస్థ వ్యవహారం..
  • కబ్జాలు చేయడం చెరువులను చెరబట్టడమే వీరి వృత్తి..
  • ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ అధికారి నికేష్ ఇలాకలో జరిగిన అతిపెద్ద భూస్కాం..
  • బడా నిర్మాణ సంస్థ చెరువులో చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చాలి..
  • హైడ్రా పవర్ ఏంటో ఈ లోకానికి చూపాలంటున్న సామాజికవేత్తలు..

హైడ్రా ఒక పెను తుఫానులా అక్రమ కట్టడాలపై దూసుకువెళ్తుంది. ఆక్రమణలు చేయాలన్నా, అక్రమ నిర్మాణాలు నిర్మించాలన్నా గజగజా వణకిపోయే పరిస్థితి నెలకొంది. ఒక్క అడుగు ముందుకువేయడానికి అక్రమార్కులు ఆలోచించేలా హైడ్రా తన పవర్ ని చూపిస్తోంది. అయితే కొందరు ఈ హైడ్రాను సైతం లెక్కచేయడంలేదు. తమ అక్రమ కార్యకలాపాలను యథేచ్ఛగా, నిస్సిగ్గుగా కొనసాగిస్తూనే ఉన్నారు. మరి వీరికి ఇంతటి ధైర్యం ఎక్కడనుంచి వచ్చిందో అర్ధం కాదు. ఈ కోవలోకే వచ్చి చేరింది ఫోనిక్స్ సంస్థ. ఈ సంస్థ వెనకాల ఒకప్పుడు మంత్రిగా చక్రం తిప్పిన నాయకుడు ఉన్నాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఒక పెద్ద చెరువును ఆక్రమించి చెరువు నడిబొడ్డులో 45 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్న ఈ ఫోనిక్స్ సంస్థ భరతం పట్టి..అక్కడి అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి..ఈ లోకానికి హైడ్రా సత్తా ఏమిటో చూపించాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం శివారులో ఉన్న పుప్పాలగూడ గ్రామ పరిధిలోగల సర్వే నెంబర్ 272, 273, 274లో ఫోనిక్స్ నిర్మాణ సంస్థ దర్జాగా కబ్జా చేస్తున్న వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచల నంగా మారింది. సుమారు 1000 కోట్ల రూపాయల పైచిలుకు విలువచేసే ఔటర్ రింగ్ రోడ్డుకు ఆను కొని ఉన్న విలువైన స్థలాన్ని దొంగ పత్రాలు సృష్టించి, వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 9 ఎకరాల 24 గుంటల చెరువును చెరబట్టి పూర్తిగా పూర్తి చేసి, హైడ్రా కమిషనర్ కార్యాల యానికి పెనుసవాలుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నడి చెరువులో 45 అంత స్తుల భవన నిర్మా ణాలు చేపడుతూ… భారీ భూకబ్జాకు తెరలేపిన నిర్మాణ సంస్థ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెల్లు వెత్తుతున్నాయి.

ఇక ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన ఫోనిక్స్ నిర్మాణ సంస్థ వేలకోట్ల విలువైన స్థలాన్ని తమ ఖాతాలో జమ TritonNow WEB SEAL చేసుకుంది. తెరవెనుక గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పి ఫోనిక్స్ నిర్మాణ సంస్థకు ఎలాంటి ఆటం కాలు ఎదురవకుండా చూసాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లను సృష్టించి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకున్న తీరు చూస్తే అధికారం ఉంటే ఏదైనా సాధ్యమని ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తుంది.

కబ్జాలు చేయడం, చెరువులను చెరబట్టడమే ఫోనిక్స్ యాజమాన్య ధ్యేయంగా కనబడుతోంది. సుమారు 150 కోట్ల పైచిలుకు అక్రమాస్తులను పోగు చేసుకుని, ఇటీవలే ఏసీబీ అధికారులకు పట్టు బడిన ఇరిగేషన్ శాఖ కుమార్ విధులు నిర్వర్తించిన ఇలాకలో నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయడం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పెను సవాలుగా మారింది. తెరవెనక ధరణిని అడ్డుపెట్టుకొని ఓ మంత్రి చేసిన వ్యవహారం పై చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి హైడ్రా పవర్ ఏంటో ఈలోకానికి చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

సామాజికవేత్తలు, ఇరిగేషన్ శాఖలో ఎన్ఎసీలు లేకుండా హెచ్ఎండిఏ లేక్ సైట్ నుండి లేక్ ఐడి నెంబర్ 66 గల చెరువును తొలగించి, సామాన్య ప్రజల కళ్ళు గప్పినట్టు తేటతెల్లమవుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ శాఖలలో పనిచేసిన సంబంధిత అధికారులు ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాముల్కె. కాసులకు కక్కుర్తి పడి ఫోనిక్స్ నిర్మాణ సంస్థకు అన్ని విధాలుగా అక్రమ పత్రాలను సక్రమం చేసి వందల కోట్లను పోగుచేసుకొని చేతులు దులుపుకున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ లెక్ ప్రొటెక్షన్ కార్యాలయ అధికారులు ఫోనిక్స్కు పరోక్ష సహకారాలు అందించి అక్రమ వ్యవహారాలలో భాగస్వామ్యం విషయం పై హైడ్రా రంగనాథ్ విచారణ జరిపితే..కళ్ళు బైర్లుకమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఫోనిక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాలు, మింగిన చెరువులు, సృష్టించిన బోగస్ పత్రాలు, చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, దొడ్డి దారిన పొందిన నిర్మాణ అనుమ తుల వ్యవహారానికి సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”.

Latest News

సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS