తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ల సహకారంతో హిమాయత్ సాగర్ చెరువు చుట్టూపక్కల ఉన్నటువంటి గ్రామపంచాయితీ ప్రజల కల నెరవేరబోతుందని మేయర్ లత ప్రేమ్ కుమార్ గౌడ్ తెలిపారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుకోని ఉన్న హిమాయత్ సాగర్ చెరువులో ఫిల్టర్ బిట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం తరుపున 6 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుకోని ఉన్న హిమాయత్ సాగర్ చెరువు 1924లో నిర్మాణం చేయడం జరిగిందని గుర్తుచేశారు. చెరువు నిర్మాణం జరిగినప్పటి నుండి చుట్టుపక్కలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలో హిమాయత్ సాగర్ చెరువు నుండి మంచినీటి సరఫరా లేదని, ఈ చెరువు నుండి ఓల్డ్ సిటీకి నీరు సప్లై అవుతుండేదని అన్నారు. చెరువు తమ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది కూడా, కార్పొరేషన్ ప్రజలకు మంచినీటి సరఫరా చేయలేకపోతున్నామని, ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించడం జరిగిందని తెలిపారు . దీంతో వారు పై అధికారులకు ఆదేశాలిచ్చి, వెంటనే అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడంతో జలమండలి అధికారులు తక్షణమే దీనిపైన ఒక కంప్లీట్ ఎక్ససైజ్ చేసి, ఫిల్టర్ బిట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం తరుపున 6 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.