రష్యా మొదటి ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశం రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. నవంబర్ 11న ముంబయిలో జరిగే రష్యన్- ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో అయిన పాల్గొంటారని తెలిపింది. నవంబర్ 12న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో భేటీ అవుతారని పేర్కొంది. ఈ సమావేశాల వల్ల ఇరిదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.