దేశ ప్రజలకు గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.
మరోవైపు 2024 మార్చి నుండి దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. గతంలో డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.100 కి తగ్గింది.