Wednesday, March 19, 2025
spot_img

మా ఇంటికి దారి చూపించండి

Must Read
  • న్యాయం ధక్కకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం..!
  • పులుమద్ది గ్రామానికి చెందిన బాధితుడు శివయ్య ఆవేదన
  • అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వైనం

వికారాబాద్ మండల పరిధిలోని పులిమద్ది గ్రామంలో గ్రామపంచాయతీ రోడ్డుని కొందరు గ్రామానికి చెందిన వారు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని గ్రామానికి చెందిన శివయ్య ఆవేదన చెందుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న రోడ్డుని ఇటీవల కొందరు రోడ్డుకు అడ్డంగా షెడ్డు నిర్మించి మాకు ఇతర ఇండ్లకు రాకపోకలకు ఇబ్బంది కలగజేస్తున్నారు. ఇట్టి విషయంలో గ్రామ మాజీ సర్పంచ్ కు, సెక్రెటరీకి ఫిర్యాదు చేసి పలుసార్లు పంచాయతీ పెట్టినా అక్రమదారుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపులకు గురి చేయడంతో చేసేది ఏమీ లేక కలెక్టర్, ఎంపీడీవో గ్రామ సెక్రెటరీ ఫిర్యాదు చేశాను. ఎంపీడీవో ఏ ఒక్కరోజు కూడా వచ్చి చూసిన పాపాన పోలేదని బాధితుడు శివయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం మాజీ సర్పంచ్ సర్వే నెంబర్ 1 లో దాదాపు 20 ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మడంతో మేము కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేస్తూ నాటి నుండి గ్రామంలో ఇంటికి టాక్స్ తో పాటు ఇతర ప్రభుత్వ సంబంధించిన పన్నులు కడుతూ వస్తున్నా కూడా మా ఇంటికి వెళ్లేందుకు ఉన్న రెండు మార్గాలు కబ్జాకు గురైతున్నాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని బాధితుడు శివయ్య ఆవేదనకు గురయ్యారు. మా ఇంటికి వెళ్లేందుకు దారి అధికారులు ఇప్పించకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితుడు శివయ్య కు న్యాయం చేస్తారా లేక ఇలాగే వదిలేస్తారా అనేది వేచి చూడాలి మరి.

గ్రామపంచాయతీ సెక్రటరీ శిల్ప వివరణ…
శివయ్య ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజా వాణి లో ఎంపీడీవో కు ఆదేశించినారు కలెక్టర్ విచారణ చేయమని ఎంపీడీవో గ్రామానికి విచారణకు వస్తామని చెప్పారు. వాళ్లు కచ్చా లే అవుట్లో ప్లాటు కొనుగోలు చేయడం జరిగింది. కానీ 2018 పంచాయతీ చట్టం నిబంధన ప్రకారం వారి వద్ద టాక్స్ వసూలు చేస్తున్నాం.

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS