Wednesday, April 16, 2025
spot_img

ఆసియా ఛాంపియన్‌ షిప్‌ నుంచి సింధు ఔట్‌

Must Read

యమగుచి చేతిలో సింధు ఓటమి

2025 ఆసియా ఛాంపియన్‌ షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధుకు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన సింధుకు హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌లో పరాజయం ఎదురైంది. ఆమె జపాన్‌కు చెందిన యమగుచి చేతిలో 12-21, 21-16, 16-21 తేడాతో ఓడిరది. తాజా ఓటమితో సింధు ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. జపాన్‌కు చెందిన యమగుచితో సింధు గురువారం రెండో రౌండ్‌లో ఢీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి యమగుచి సింధుపై మొదటి సెట్‌లో భారీ తేడా 12-21తో నెగ్గింది. ఇక రెండో సెట్‌లో సింధు కమ్‌అ బ్యాక్‌ ఇచ్చింది. ప్రత్యర్థికి సవాల్‌ విసురుతూ చురుగ్గా ఆడిరది. ఫలితంగా రెండో సెట్‌ను సింధు 21-16తో దక్కించుకుంది. దీంతో ఫలితం కోసం మూడో సెట్‌ ఆడాల్సి వచ్చింది. డూ ఆర్‌ డై సెట్‌లో సింధు ప్రత్యర్థికి గట్టిగానే బదులిచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో సింధు ఆఖర్లో పట్టు కోల్పోయింది. చివర్లో యమగుచి 16-24 తేడాతో నెగ్గి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. దీంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, గత నాలుగు టోర్నమెంట్‌ల్లో సింధు రెండో రౌండ్‌ దాటకపోవడం గమనార్హం.సింధు ఓటమితో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజావత్‌ కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. జపాన్‌ సీడ్‌ కొడయ్‌ నరకొను ఎదుర్కొన్న ప్రియాన్షు 14-21, 17-21 వరుస సెట్లలో ఓడిపోయాడు. ఇక కుల్వంత్‌తో ఢీ కొట్టిన కిరణ్‌ 21-19 13-21 16-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్‌ కపిల- తానిషా కాస్ట్రో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. రెండో రౌండ్లో ఈ జోడీ చైనీస్‌ తైపీకి చెందిన యే హాంగ్‌ వీ- నికోల్‌ గొంజాలెస్‌ చాన్‌ను ఢీ కొట్టింది . ఈ రౌండ్‌లో భారత్‌ జోడీ 12-21 21-16 21-18తో నెగ్గి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

Latest News

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు 1278 నామినేషన్లు

వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్‌ చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్‌ ఈ నెల 21 నుండి స్క్రీనింగ్‌ చేయనున్న జ్యూరీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS