Wednesday, March 12, 2025
spot_img

కాలువలు పూర్తి చేసి నీటిని వదలండి సార్‌

Must Read
  • గజ్వేల్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భాను ప్రకాష్
  • నీటి పారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేత

భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే కాలువలు ఉన్న పంట పొలాలకు భూనిర్వసితులకు నీరు అందలెక పోతున్న గ్రామాలకు సాగు నీరు అందక పొలాలు ఎండుతున్నాయని వెంటనే కాలువలు పూర్తీ చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని కోరుతూ గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు ఆధ్వర్యంలో మునిగడప తీగుల్ రైతులు గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు రైతులు శుక్రవారం కార్య నిర్వాహక ఇంజనియర్ డివిజన్ గజ్వేల్ నీటి పారుదల శాఖ అధికారులు చాందీరాము, శ్రీధర్ ల‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ శ్రీ కొండపోచమ్మ జలాశయం నుంచి జగదేవపూర్ వస్తున్న సాగునీటి కాలువను జగదేవపూర్ నుంచి రాంనగర్ గ్రామం వరకు ఉన్న కాలువను పూర్తిచేసి మునిగడప పెద్ద చెరువులోకి నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. మునిగడప పెద్ద చెరువు నింపడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు చాట్లపల్లి, వట్టిపల్లి, బస్వాపూర్, మాందాపూర్, పలుగుగడ్డ, కొండాపూర్, గొల్లపల్లి స్వాలాపూర్, కొండేటి చెరువు, మొల్లగూడెం, పాముకుంట, బి జి వెంకటపూర్, గోపాల్ పూర్, ధౌలాపూర్, గ్రామాల పంట పొలాల రైతులకు నీళ్లు అందుతాయని భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. పంటలు పండించే, ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే తమ పంటపొలాలకు సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పాములపర్తి చేభర్తి నుండి కుడవెల్లి వాగులోకి సాగునీటి విడుదల చేయాలని అధికారులకు విన్నవించుకున్నారు. త్వరలో ఇంటి విషయంపై టిపిసిసి అధికార ప్రతినిధి బండర్ శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి సాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చాట్లపల్లి మాజీ ఎంపిటిసి సావిత్రి నర్సింలు, మాoదాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బిక్షపతి, కొండపోచమ్మ డైరెక్టర్ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్న, రామచంద్రం, నర్సింలు, స్వామి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా.. వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్.. షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS