వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. చర్లపల్లి జైలులో తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారించిన హైకోర్టు నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇంటి భోజనానికి అనుమతించింది.