ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. సౌత్ కొరియా సహకారంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించామని, తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
గొప్ప నాయకులు త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, దేశంలోని గొప్ప నాయకులు.. కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం వృత్తిని, సుఖాలను, జీవితాన్ని త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంధర్బంగా గుర్తుచేశారు. గొప్ప నాయకుడిగా ఎదగాలంటే దైర్యం, త్యాగం గురించి ఆలోచించాలని, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే విజయం సాధిస్తారని తెలిపారు.