- ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి వరుస మోసాలు
- ఫోర్జరీ క్లాస్ 2 సర్టిఫికేట్‌తో సుమారు రూ.30 నుండి రూ.40కోట్ల పనులు
- ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, సర్కిల్ 17లలో పనుల కేటాయింపు
- జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీగా ముడుపులు
- మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో విదేశీ టూర్
- అనుమతుల్లేకుండానే అధికారుల దుబాయ్ ట్రిప్, రేవ్ పార్టీలు
- ఫేక్ సర్టిఫికేట్లతో సూపరింటెండెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తికి అధిక ప్రాధాన్యత
- సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్‌లలో సింగిల్ టెండర్‌కే ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ కు కేటాయింపు
రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ లు రావాలంటే కావాల్సింది డబ్బు, రాజకీయ పలుకుబడే అన్నది అర్థమవుతుంది. ‘అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు’ ఉన్నది అధికారుల వ్యవహారశైలి. నిజంగా ఎలాంటి అనుభవం, అర్హత లేని వారికి బడా బడా కాంట్రాక్ట్ లు ఇచ్చి తప్పులు కప్పిపుచ్చుతున్నారు. కాసులకు కక్కుర్తీ పడి ఫేక్ సర్టిఫికేట్ లు జారీ చేస్తున్నారు. టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ లు అప్పగించిన, ఛీటీలు వేసి డ్రా తీసి కాంట్రాక్ట్ లు ఇచ్చినా తన అనుకున్న వారికే రావడం విశేషం. ఇందులోనే అసలు మర్మం దాగి ఉంటుంది. ఇలాంటివన్నీ పూర్వ కాలాల నుంచే వస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. కాకపోతే, ప్రస్తుత కాంట్రాక్టర్లు రెండాకులు ఎక్కువగానే చదివారు. ఏ పొలిటికల్ లీడర్ ను మచ్చిక చేసుకోవాలి, ఏ అధికారికి ఎంత ఇవ్వాలి అనేది ఆ మాత్రం తెలుసు. అప్పుడే తమకు కాంట్రాక్ట్ దక్కుతుంది అని దొంగ తెలివి బాగానే ఉన్నది. అలాంటి వారు స్వతంత్ర తెలంగాణలో చాలానే ఉన్నారు. అందులో ఒకరు కల్యాణ్ చక్రవర్తి. తెలంగాణలో మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ క్లాస్ 2 సివిల్ కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్న ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ గురించే ఈ వార్త. ఆయన మోసాల అన్నీ ఇన్నీ కావు. అందులో భాగంగానే ఇదీ మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి రెండవ కథనం..
రాష్ట్రంలో ఎక్కడ, ఏ నిర్మాణం, పని చేయాలన్నా కాంట్రాక్టర్ లతోనే సాధ్యం. అందుకే కాంట్రాక్టర్లను ఉన్నతాధికారులు గ్రిప్ లో పెట్టుకుంటారు. నీకింత, నాకింత అని కాంట్రాక్టర్ లతో డీల్ కుదుర్చుకుంటారు. పని ఏంటీ, దాని కాంట్రాక్ట్ ఎంత అని చూసుకొని నాణ్యతలేకున్నా, పనులు జర అటు, ఇటుగా పూర్తి చేసినా బిల్లుల చెల్లింపు బాధ్యత తమదే అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అలాగే ఫోర్జరీ క్లాస్ 2 సర్టిఫికేట్‌తో జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల అండతో సుమారు రూ.30 నుంచి రూ.40కోట్ల పనులను ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి పొందారు. అంతేకాకుండా ఈ పనులు పొందేందుకు పరోక్షంగా జీహెచ్ఎంసీ అధికారులు సహకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓ టెండర్ పొందాలంటే టెక్నికల్‌గా అన్ని అర్హతలు ఉండాలి. వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ, అధికారులు ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ వారు 2020లో క్లాస్ 2 కాంట్రాక్టర్ ఫేక్ సర్టికేట్‌ను గుర్తించికపోవడం శోచనీయం. ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ సర్కిల్, సర్కిల్ 17లలో ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ కు భారీగా పనులు కేటాయించినట్లు స్పష్టం అవుతుంది. ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యం జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించి, నాసిరకమైన పనులు చేయడమే కాకుండా, అసంపూర్తి పనులు చేసి, పూర్తి బిల్లులు పొందడంపై పలువురు మండిపడుతున్నారు.
‘ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు’ ఉంటది కాంట్రాక్టర్ల పనితీరు. ఆ కోవకు చెందిన పెద్దమనిషి మోసాల సామ్రాట్ సి.కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఐఆర్‌డీ, ఎంఈటీ పనుల బిల్లులు వచ్చాక గతేడాది కొందరు ఇంజినీర్లు దుబాయ్, మలేషియా యాత్రలకు వెళ్లడం, తరచుగా గుత్తేదారులు కొందరు ఇంజినీర్లను తిరుమల యాత్రకు తీసుకెళ్తుండటం జీహెచ్ఎంసీలో సర్వసాధారణమైంది. ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ గుత్తేదారులే భరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవర్థన్ గౌడ్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే దుబాయ్ ట్రిప్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వీరంతా ఒకే హోటల్లో కాంట్రాక్టర్లు, అధికారులు కలసి ఎంజాయ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి గోవర్థన్ గౌడ్‌ను ఆరా తీయగా ఎలాంటి అనుమతులు లేకుండానే టూర్ కు వెళ్లినట్లు అంగీకరించారు. సి.కళ్యాణ్ చక్రవర్తితో వెళ్లలేదని, ఇతర మిత్రులతో కలిసి విదేశాలకు పోయివచ్చినట్లు వెల్లడించడం గమనార్హం.
అవినీతి అధికారులు ఉన్నంత కాలం మోసాలకు పాల్పడే వారు ఉంటనే ఉంటారు. ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను గుర్తించి, ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ వారికి బ్లాక్ లిస్ట్‌లో పెట్టవల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీని అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం సూపరింటెండెంట్ ఇంజనీర్ సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్‌లలో మొదటిసారిగా పిలిచిన టెండర్‌లోనే కాంట్రాక్టర్లు పాల్గొనడానికి ఆసక్తి కనబర్చకపోవడంతో సింగిల్ టెండర్ దాఖలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాంటి సమయంలో టెండర్ నియమ నింబధనల ప్రకారం మరోసారి టెండర్లను పిలువాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్లు స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ సింగల్ టెండర్ ను ఆమోదించడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా అధికారులు జీహెచ్ఎంసీని నష్టపర్చే విధంగా పనులను కేటాయించారని క్లీయర్ గా తెలుస్తుంది. మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి ప్రభుత్వ కాంట్రాక్ట్ లు తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. అందులో భాగంగానే కొందరి అధికారులకు అవినీతి సొమ్మును ఎరవేయడం జరిగింది..
అవినీతికి పాల్పడిన అధికారులను, అలాగే ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ చేసిన పనుల నాణ్యత ప్రమాణాలపై, ఫేక్ సర్టిఫికేట్, బ్యాంక్ గ్యారెంటీలతో కేటాయించిన పనులపై, బిల్లులపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం..
ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి చేసిన అవినీతిపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..