Monday, April 21, 2025
spot_img

మోసానికి కేరాఫ్ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు

Must Read
  • ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చ‌దివి, ర్యాంకు సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు
  • విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థ‌లే మోసాల‌కు తెర‌లేపారు..
  • శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు..
  • దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం
  • తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి ..
  • తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్ సంస్థలు ..
  • కాలేజీలపై చీటింగ్ కేసు నమోదు చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు బరితెగించేశాయి.. విద్యా వ్యవస్థను విద్యా విలువలను నాశనం చేయడమే లక్ష్యంగా చేసుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా మోసానికి తెరలేపాయి.. డబ్బు ఉందన్న అహంకారంతో.. వ్యవస్థలను తమ గుప్పిట పెట్టుకున్నామన్న మితిమీరిన విశ్వాసంతో తల్లిదండ్రులను, ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డును సైతం నయవంచన చేస్తూ విద్యార్థుల భవిష్యతును నాశనం చేస్తున్నాయి.. సంతలో వస్తువులను కొన్నట్లుగా, కూరగాయలను కొన్నట్లుగా మంచిగా చదివే విద్యార్థులను ఎల్లలు దాటి మరి కొనుక్కుని.. తమ సంస్థల్లో చదివినట్లుగా నిస్సిగ్గుగా ఇక్కడ భారీ ప్రచారం చేసుకుంటున్నాయి.. తాము ఇచ్చే వ్యాపార ప్రకటనలు ఎవరూ చూడరు.. ఎవరికీ తమ అంత తెలివి తేటలు.. ఆపాటి జ్ఞానం లేదనుకున్నారో ఏమో తెలియదుగాని.. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల యాజమాన్యాలు లెక్కలేనన్ని ర్యాంకులు తమవిగా ఇటీవల ప్రకటించుకున్నాయి.. ఇది ఒక కాలేజీ యాజమాన్యం చేస్తే ఎదో అనుకోవచ్చు.. రాష్ట్రంలో మేమె నంబర్ వన్ గా చెప్పుకుని తిరిగే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఒకే పేరుతో ఉన్న విద్యార్థులను లెక్కకు మించి తమ విద్యార్థులుగా ప్రకటించుకున్నాయి.. ఒకే పేరుతో ర్యాంకుతో ఉన్న విద్యార్థులు రెండు కాలేజీలలో ఎలా చదివారో శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల యాజమాన్యాలే చెప్పాలి.. వీరి నయవంచనను మోసపూరిత బాగోతాన్ని ఆదాబ్ హైదరాబాద్ బట్టబయలు చేసింది..

తమ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు..:-
వివరాల్లోకి వెళ్ళితే తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్-2025 లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలు పోటా పోటీగా తమ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులుగా ప్రకటనల రూపేణా ప్రచురించుకున్నాయి.. కానీ విచిత్రమేమిటంటే ఒకే పేరుతో, ర్యాంకుతో ఉన్న కొంతమంది విద్యార్థులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు తమ కాలేజీలో చదివినట్లుగా ప్రచురించుకున్నాయి… ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని దొంగ ర్యాంకులను తమ సంస్థల్లో చదినట్లుగా ప్రకటలను ఇచ్చేశాయి.. వీటిలో కొన్ని వివరాలు పరిశీలిస్తే.. ర్యాంకు (9) పేరు :- తోష్నివాల్ శివేన్, దరఖాస్తు సంఖ్య: 250310391420, ర్యాంకు (12) పేరు :- సౌరవ్, దరఖాస్తు సంఖ్య: 250310254844, ర్యాంకు (22)పేరు :-లక్ష్య శర్మ, దరఖాస్తు సంఖ్య:-250310034153, ర్యాంకు (36)పేరు :- ప్రదీష్ గాంధీ ఎస్, దరఖాస్తు సంఖ్య:-250310788252, ర్యాంకు (60)పేరు :-సముద్ర సర్కార్, దరఖాస్తు సంఖ్య:-250310179442, ర్యాంకు (61) పేరు :-సోహాన్ కాళిదాస్ చేలేకర్, దరఖాస్తు సంఖ్య:- 250310202114, ర్యాంకు (76) పేరు :- యాష్ కుమార్, దరఖాస్తు సంఖ్య :- 250310204405.. ఇలా పలు విభాగాల్లో సైతం శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు రాణించారని ఆ సంస్థలు ప్రకటనల ద్వారా పేర్కొన్నాయి.

దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులను బురడి కొట్టిస్తున్న వైనం :-
మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీ చైతన్య,నారాయణ కాలేజీలు.. దొంగ ర్యాంకులను,తమ సంస్థల్లో చదివిన విద్యార్థులకు రాని మార్కులను మోసపూరిత ప్రకటనలనిచ్చి విద్యార్థులను.. వారి తల్లిదండ్రులను కొన్నెండ్లుగా మోసం చేస్తున్నాయి.. సిస్టం లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా చేసుకున్న ఈ కార్పొరేట్ సంస్థలు విద్యావ్యవస్థలను నాశనం చేస్తూ సమాజానికి, విద్యా వ్యవస్థకు ప్రాణసంకటంగా మారిపోయింది..

తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య,నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల దొంగ బాగోతాలు ఈ నాటివి కాదు..ఏజెంట్లను నియమించి వారికీ ఎంతో కొంత ముట్టజెప్పి అడ్మిషన్లు చేసుకోవడం.. పదవతరగతి విద్యాసంస్థల ప్రతినిధులకు ఖరీదైన బహుమతులిచ్చి విద్యార్థులను తమ కళాశాలలో చేరేవిధంగా చేసుకోవడం..స్థానికంగా ఉన్న పెద్దమనుషులకు నయానో భయానో ఎంతో కొంత చదివించుకుని.. ఇలా ఎన్ని దొంగ మార్గాలున్నాయో అన్ని దొంగ మార్గాల ద్వారా అడ్మిషన్లు చేపడుతూ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించేశాయి..

కాలేజీలపై చీటింగ్ కేసు నమోదు చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్ :-
దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులను బురడి కొట్టిస్తున్న శ్రీ చైతన్య,నారాయణ కాలేజీలఫై ప్రభుత్వం సుమోటాగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. తమకు ఖచ్చితమైన ఆధారాలు ఉంటె ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ప్రతినిధికి ఇటీవల ఇంటర్ బోర్డు అధికారి వసుందర చెప్పారు. మరి దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులను బురడి కొట్టిస్తున్న శ్రీ చైతన్య,నారాయణ కాలేజీలఫై ఇంటర్ బోర్డు చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి..

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS