Friday, September 5, 2025
spot_img

మే9న సింగిల్ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Must Read

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సింగిల్ మే9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన హిస్టారిక్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. హీరో శ్రీవిష్ణు మే 9న రిలీజైన కల్ట్ సూపర్ హిట్ మూవీస్ గురించి చెబుతుండగా చివర్లో నిర్మాత అల్లు అరవింద్ జైలర్ హుకుం స్టయిల్ లో మే 9న రిలీజ్ డేట్ ని లాక్ చేయడం ఇంట్రస్టింగ్ గా వుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ విశాల్ చంద్ర శేఖర్. సినిమాటోగ్రఫీ ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్ ప్రవీణ్ కెఎల్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This