వరద బాధితులకు సహయం అందించేందుకు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించింది. శనివారం మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి శ్రీనివాస్, ఎం.చంద్రారెడ్డి , పరుచూరి మురళీ కృష్ణ , కేఎస్ రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.