- ఎస్సీల ఆదాయం పెంచేదిశగా ప్రత్యేక చర్యలు
- దళితుడిని స్పీకర్ చేసిన ఘనత మాదే
- అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీల రాక
- రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మెరుగైన భోజనం
- పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైకాపా హయాంలో కేవలం 437 మందికే అవకాశం కల్పించారు. ఎస్సీల ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం అని వివరించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన పర్యటించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేడ్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ తెదేపా అని గుర్తు చేశారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారు. పేదలకు అండగా ఉంటానని అందరికీ హావిూ ఇస్తున్నా. ప్రతిష్ఠాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్‌ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వారికి 8 లక్షల ఎకరాలను తెదేపా ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిందని చంద్రబాబు తెలిపారు.
అంతకుముందు గ్రామంలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్ చిత్రపటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం పీ4 కార్యక్రమాల లబ్ధిదారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలి. విజన్ 2047 ద్వారా స్వర్ణాంధప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రపంచంలో చాలా మంది తెలుగువారు ఉన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. మార్గదర్శి, బంగారు కుటు-ంబంలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం పీ4 తెచ్చాం. ప్రైవేటు- భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చడం కోసం పనిచేస్తున్నాం. పొన్నెకల్లులో ఇంకా 300 మందికి మరుగుదొడ్లు లేవు, 6 నెలల్లో నిర్మిస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ చూడని భయంకర రాజకీయాన్ని 2019-24 మధ్య చూశానని సీఎం చంద్రబాబు అన్నారు. చివరకు తాను కూడా బయటకు రాలేని పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు.
జగన్ హెలికాప్టర్‌లో వస్తుంటే కిందనున్న చెట్లను నరికివేశారని గుర్తు చేశారు. ప్రజల అభిమానంతో తెదేపా తరఫున 94శాతం అభ్యర్థులు గెలిచారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం తమదని చంద్రబాబు తెలిపారు. విూలో రాజధాని ఉత్సాహం కనిపిస్తుంది.. భవిష్యత్తులో మేము ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదన్న సంతోషం విూలో కనిపిస్తుంది అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.. మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే అంబేడ్కర్ రాజ్యాంగమే కారణం.. నేను విూకు ఆయుధాలు ఇవ్వలేదు… ఓటు హక్కు ఇచ్చాను అని అంబేడ్కర్ అన్నారు.. గత ఐదేళ్లలో ఆనందంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇక, రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.. ఎన్నికలలో నిలబెట్టిన వారిలో 94 శాతం మంది గెలిపించారు.. పేదలకు అండగా ఉంటాను, సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పాను.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నాం.. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటు-ందన్నారు. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఎన్టీఆర్ కు అంబేడ్కర్ అంటే అమితమైన గౌరవం ఉండేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే అంబేడ్కర్ కు భారతరత్న ఇచ్చారు అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
నేను అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఒక కుటుంబాన్ని కలిశాను.. చిన్న రేకుల ఇంట్లో ఉంటు-న్నారు.. ఒకతను కార్పెంటర్, మరొకరు మెకానిక్ గా పని చేస్తున్నారు.. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు.. క్షేత్రస్థాయిలో చూస్తేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది.. అందులో నుంచి పుట్టిన ఆలోచనే పీ-4 కార్యక్రమం అన్నారు. ఇక, ప్రతినెలా విూటింగులు పెట్టాం.. గ్రామంలో ఎక్కడా దళితులపై దాడులు జరగకూడదని ఆదేశించాను.. ఇప్పుడు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు.. భవిష్యత్తులో ఎస్సీల పిల్లలందరూ చదువుకునేలా చూస్తాం.. రత్నలత తండ్రి ఎంత ఆనందంగా ఉన్నారో చూశాం.. కూతురు విదేశంలో ఉద్యోగం చేస్తున్నదుకు సంతోషంగా ఉందన్నారని చంద్రబాబు తెలిపారు.