రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ను బలోపేతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. సంఘంలోని బాధ్యులంతా సమిష్టిగా ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు అండగా ఉండాలని, సమస్యలపై స్పందించాలని అన్నారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆయన స్థానిక ఫెడరేషన్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఫెడరేషన్ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. స్థానిక జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా కమిటీ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్వాయి జానయ్య, గుండగాని జమున, జిల్లా సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గం అడ్ హక్ కమిటీ కన్వీనర్ వంగాల వెంకన్న, సభ్యులు బండి కిరణ్, షేక్ జాని, సీనియర్ జర్నలిస్టు నాంపల్లి శ్రీనివాస్, వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.