ప్రముఖ సినీ నటి సుహాసిని ప్రస్తుతం ఉన్న చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలకు తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. హీరోయిన్స్ గతంలో స్కిన్ షో , ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి చాలా అరుదుగా అంగీకరించేవారు, కానీ ఇప్పుడు అలా కాదు ఏదైనా చేస్తున్నారు అని అన్నారు.