ఈశా ఫౌండేషన్ పై హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ పై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్ వివరాలను తమకు సమర్పించాలని తెలిపింది.