తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు విన్న కోర్టు విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపింది. దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 03వ తేదీకి వాయిదా వేసింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఇటీవల ఏపీ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి , న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామితో సహ పలువురు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.