వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‌ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా ఉన్న బీఆర్ఎస్ నేత, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.