Wednesday, December 4, 2024
spot_img

400 నగరాలకు స్విగ్గీ విస్తరణ

Must Read

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ ‘స్విగ్గీ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమి షాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘బోల్ట్’ సేవలను దేశంలోని 400పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో స్విగ్గీ తన బోల్ట్ సేవలను ప్రారంభించింది. క్విక్ కామర్స్ డార్క్ స్టోర్స్ గల జెప్టో గత నెలలో లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ తో కేఫ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బెంగ ళూరులోనే స్విష్ అనే పది నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్..బెంగళూరు నగర పరిధిలోనూ, ఇతర ప్రథమ శ్రేణి నగరాల్లో సేవలను విస్తరిస్తోంది. ఇందుకోసం ఎసెల్ నుంచి 20లక్షల డాలర్ల సీడ్ ఫండ్ సేకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బోల్ట్ సేవలకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని స్విగ్గీ వెల్లడించింది. తర్వాత హర్యానా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పం జాబ్ రాష్ట్రాలపరిధిలో బోల్ట్సేవలకు కస్టమర్ల నుంచి ఆదరణ ఉందని వివరించింది. తక్కువ సమయంలో తయారయ్యే ఆహార పదార్థాలను మాత్రమే బోల్ట్ కింద డెలివరీ చేస్తామని స్విగ్గీ తెలిపింది.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS