హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....