తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...