తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...