తెలుగు సాహిత్య లోకంలో ఒక ధిక్కార స్వరం మూగబోయింది. ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని, రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో ఆగస్ట్ 11, 2025న వరంగల్‌లో మనలను శాశ్వతంగా విడిచిపోయారు. ఆమె లేని లోటు కేవలం ఒక వ్యక్తి నష్టం మాత్రమే కాదు, తెలంగాణ సాహిత్యం, ఉద్యమాలకు, స్త్రీవాద భావనలకు తీరని లోటు. రజిత...