Monday, November 25, 2024
spot_img

hyderabad

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి, సీఓఓ ధీరన్ చౌదరి, వండర్ లా పార్క్ హెడ్ మధు సూధన్ గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి...

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....

హైడ్రా బాధితులకు రక్షణ కవచంలా ఉంటాం : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నరని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులతో కలిసి హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, హైడ్రా బాధితుల కోసం...

ఎవ‌రి కోసం బీసీ ఉద్య‌మం..

( ప‌దేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్య‌కారుల‌కు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ) రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.! నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ? బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.? బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల స‌మ‌స్య‌లన్నీ నిజంగా తొలుగుతాయా..? ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...

హర్షసాయి కేసులో ట్విస్ట్,మరో కేసు పెట్టిన బాధితురాలు

తెలుగు యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుండి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్‎లో బాధితురాలు మరో కేసు పెట్టింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‎పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త మీనన్ సందడి

హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‎లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‎సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
- Advertisement -spot_img

Latest News

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్‎తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

ఆన్‎లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS