సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....
హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
పట్టింపు లేని మున్సిపల్ అధికారులు
బేగంపేట్ సర్కిల్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్ పాత్ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్ హోటల్ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్ పాత్ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...
హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్రమంతి కిషన్‌రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...
యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...
దసరా నవరాత్రులకు హైదరాబాద్‌లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు.
శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ పేట్లబుర్జ్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు.
ఈ సంధర్బంగా మంత్రి పొన్నం...
ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...
కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం
మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి
కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...