పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.శిల్పంచిత్రలేఖనం,డిజైన్,సంగీతం,రంగస్థలం,నృత్యం,జానపదం,తెలుగు,చరిత్ర-పర్యాటకం,భాషాశాస్త్రం,జర్నలిజం,జ్యోతిషం,యోగ తెలుగు విశ్వవిద్యాలయం పిజి,యుజి,పీజీ డిప్లొమా,డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది.పూర్తీ చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 09-08-2024 వరకు,ఆలస్యరుసుముతో 19-08-2024 లోగ సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పేర్కొన్నారు.
నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్దంగా డోనేషన్ల వసూలు చేస్తున్న యాజమాన్యం
ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు
పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్
పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో...
రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా
రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి
కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...
సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...
2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...