పాతాళగంగలో పుణ్యస్నానానికి దిగిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాతాళగంగ వద్ద స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అందులో మునగడంతో తండ్రి, కుమారులు మరణించారు....
బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు
టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వందమందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు...
జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
ఉజ్జయినిలో సిఎం మోహన్ యాదవ్ దంపతుల పూజలు
గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక పూజలు
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్...
భారీగా తరలివచ్చిన భక్తజనం
స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన బండి
రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని...
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ
మహాశివరాత్రి సందర్భంగా జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి...
సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTHREDDY) ఎన్నిసార్లూ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని...
ప్రభుత్వాలు మారినా పనులు ఆగొద్దు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
అభివృద్ధి పనుల విషయాల్లో రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనులు ఆపొద్దని ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు....
మొత్తం 18,180 మందికి రూ. 6వేల చొప్పున జమ
తెలంగాణలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ అయ్యాయి. జనవరి...
రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ...
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(M K Stalin) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు...