యాంగ్ రెబల్ స్టార్ నటించిన " కల్కి 2898 ఎడి " సినిమా భారీగా కలెక్షన్ లను సొంతం చేసుకుంటూ,ముందుకెళ్తుంది.ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా విడుదలైన...
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...
వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన సీఎం
సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ,సీతక్క
టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తాం :రేవంత్ రెడ్డి
వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లులు అందేలా కృషిచేస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం వరంగల్ లో పర్యటించారు....
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై...
ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...
శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.
కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...
ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్...
గుండెపోటు రావడంతో రిమ్స్ కి తరలించిన కుటుంబసభ్యులు
పరిస్థితి క్రిటికల్ గా మారడంతో హైదరాబాద్ కి రిఫర్ చేసిన వైద్యులు
హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసిన రమేష్ రాథోడ్
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (58) అనారోగ్యంతో కన్నుమూశారు.గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుప్రతికి తరలించారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ గ్యాస్ ఫ్యాక్టరీలో ఫర్నస్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో మొత్తం ఆరు మంది కార్మికులు మృతిచెందారు.మరో 15 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఒక్కసారిగా పేలుడు సంభవించి దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు,కార్మికులు పరుగులు తీశారు.సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఈ...
నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా
వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ
నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్
శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...