రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఇవాళ (జూన్ 24 మంగళవారం) సాక్ష్యం చెప్పిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రజల ప్రాణాలు తీసే...