నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్నుమత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తినాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపైఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే...
ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...