కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...
రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్
ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఆదానీ...
జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...
కాంగ్రెస్ పార్టీ వివిధ కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ అంటేనే అవినీతి అని అన్నారు. దేశాన్ని బలహీనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, హరియాణ...
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‌కు వెళ్తునట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి అధిత్యనాథ్, సహా మొత్తం 40...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.
ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది
హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి
మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మావోయిస్టులు హింస,ఆయుధాలను వీడి లొంగిపోవాలని కోరారు.లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.మావోయిస్టుల హింస,భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పేందుకు...
అండమాన్,నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తి,దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ఈ పేరు...