ఈ తొలకరి వాన చినుకుల పరిమళం నా శ్వాసతో నా మదిలో కి చేరి,నా కంటి పాపకు తెలిపి,నిద్రలో ఉన్న నా మనసుని ఊరించి,ఈ పరిమళాలను ఆస్వాదించమని నాతో గోల చేస్తున్నాయి.అయినా ఈ పరిమళాలు ఎంత సేపు, తొలకరి చినుకంత సేపు,రైతులకు ఈ వర్షం ఇప్పుడు వరం,అమ్మ పాల కోసం వేచి చూసేచంటి పాపాల,వెన్నెల...
ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...