ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కి సంబంధించి ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ కోచ్‌గా శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను నియమించింది. గతంలో కూడా మహేల జయవర్ధనే ఈ పదవిలో కొనసాగారు. మహేల జయవర్ధనే కోచింగ్ లో ముంబయి ఇండియన్స్ 2017, 2019 ,2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది.
ఛత్తీస్‌గఢ్ లో నిర్వహించిన ఆల్ ఇండియా పొలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2024- 25, వార్షిక క్రీడల పోటీల్లో అంబర్‌పెట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ టీ.లక్ష్మీ మహిళల ట్రేడిషనల్ యోగసాన ఈవెంట్‌లో పాల్గొని బ్రౌంజ్ మెడల్ అందుకున్నారు. ఈ సంధర్బంగా డీఎస్పీ టీ.లక్ష్మీ, ఐపీఎస్ రమేష్, డీఎస్పీ ఆర్.వి.రామారావులు మంగళవారం...
హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...
సీఎం రేవంత్ రెడ్డి
అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు...
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసరావుపేట రోటరీ క్లబ్ ఆర్.ఎ.సి. చైర్మన్ రాయల శ్రీనివాసరావు,రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ డైరెక్టర్,ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్...
చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‌మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు)...
చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88...
ధోనీ పై బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోనీ కూడా సాధారణ మనిషే,అప్పుడప్పుడు తన సంయమానాన్ని కోల్పోతాడు..కానీ ఫీల్డ్ లో తన ఆగ్రహాన్ని చూపించడం చాలా అరుదు..కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదనేది ధోనీ భావన అని చెప్పుకొచ్చాడు.