Thursday, March 13, 2025
spot_img

కిడ్నీ ఆరోగ్యం జాగ్రత్త..

Must Read
  • విక‌రాబాద్ జిల్లాల్లో పెరుగుతున్న డయాలసిస్‌ రోగులు
  • రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే ఎక్కువ
  • తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహారపు అలవాట్లు
  • అప్రమత్తత అవసరం అని సూచిస్తున్న వైద్య నిపుణులు
  • నేడు ‘‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’’ సందర్భంగా ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనం

మూత్రపిండాలు అనేవి మానవ పిడికిలి పరిమాణంలో ఉన్న జత అవయవాలు, ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో పక్కటెముక దిగువన ఉంటాయి. రెండు మూత్రపిండాలు వెన్నెముకకు రెండు వైపులా ఉంచబడతాయి. మూత్రపిండాలు ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడే శరీరంలోని ముఖ్యమైన అవయవాలు. అవి రక్త శుద్ధి చేసేవి. మూత్రపిండాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం శరీరంలో రోజువారీగా ఏర్పడే విషాన్ని మరియు వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్‌ చేసి తొలగించడం. మూత్రపిండాలు హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి చేయడం, రక్తపోటును నియంత్రించడం మరియు క్రియాశీల విటమిన్‌ బిని సంశ్లేషణ చేయడం ద్వారా ఎముకలను బలోపేతం చేయడం వంటి కొన్ని ఇతర ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. శరీరంలో మూత్రపిండాలు నిర్వహించే బహుళ విధులు ఉన్నాయి. ప్రజలలో అత్యంత సాధారణ సమస్య దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి.అయితే కిడ్నీలు పనిచేయక ప్రతినెలా డయాలసిస్‌ చేయించుకునే రోగుల సంఖ్య వందల్లోనే ఉంది.నేటి ‘‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’’ సందర్భంగా ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనం. ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు తగినంత నీరు త్రాగకపోవడం ఒత్తిడి సమయానికి మూత్రం పోయకపోవటం నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు యాంటీబయోటిక్స్‌ మందులు వాడటం షుగర్‌, బిపి, మూత్ర ఇన్ఫెక్షన్లతో కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. వంశం పార్యం పరంగా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే కిడ్నీలు పనిచేయక జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ డివిజన్ల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కేంద్రాలలో డయాలసిస్‌ సేవలు పొందుతున్నారు.

జిల్లాలోని ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు…
తాండూర్‌ – 8 యంత్రాలు – 72 మంది రోగులు.
పరిగి – 5 యంత్రాలు – 40 మంది రోగులు.
వికారాబాద్‌ – 7 యంత్రాలు – 52 మంది రోగులు
కొడంగల్‌ – 5 యంత్రాలు – 35 మంది రోగులకు
డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి.

రెక్కాడితే గాని డొక్కాడని వారే ఎక్కువ…
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. పోషకాహార లోపం కారణంగా ఒళ్ళు,కీళ్ళ నొప్పులతో ఎక్కువ బాధపడుతుంటారు.కూలీ పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చాక హానికర రసాయనాలతో తయారు చేసిన కల్తీ కళ్ళు తాగుతున్నారు.ఒళ్ళు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు యాంటి బయాటిక్స్‌ వాడుతున్నారు.అయితే ప్రస్తుతం 200 మందికి పైనే సేవలు పొందుతున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించాలి..
కాళ్లలో ముఖంలో వాపు,బాగా తిమ్మిర్లు వచ్చినా బీపీ, షుగర్‌ అదుపులో లేకపోయినా మూత్రంలో మంట వచ్చినా,మూత్రంలో ప్రోటీన్‌ పోతున్నా క్రియటిన్‌ 1.5 ఎంజీ కన్నా ఎక్కువగా ఉన్నా కిడ్నీ సమస్యలు వచ్చినట్లే. 90 రోజులలోపు వైద్యుని సంప్రదిస్తే నయమవడానికి ఆస్కారం ఉంటుంది. లేనిపక్షంలో దయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పోషకాహారం తీసుకోవటంతో పాటు ఎక్కువగా నీరు త్రాగాలి.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS