అక్రమంగా నిల్వ చేసిన ఫైర్ క్రాకర్స్ గోదాంపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అమ్మడానికి సిద్దంగా ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్ సెంట్రల్ జోన్ సైఫాబాద్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వీ.ఎస్. సుదీంద్ర వెల్లడించారు. వివరాల ప్రకారం, సైఫాబాద్ ఠాణా పరిధిలోని ఓ గోదాంలో వివిధ కంపెనీలకు చెందిన ఫైర్ క్రాకర్స్ నిల్వ ఉంచారని తెలిపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక టీంగా ఏర్పడి గోదాంపై దాడి చేసి
దాదాపు రూ.5లక్షల విలువల గల సరుకును స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. నిందితుడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సైఫాబాద్ ఠాణా పోలీసులకు అప్పగించడంతో వారు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని అన్నారు. ప్రైవేట్ ఉద్యోగి శ్రీరామ్ గోదాం నిర్వహిస్తున్నాడాని తెలిపారు.
Must Read