బీహార్ రాష్ట్ర రాజధాని పట్న నగరంలోని బీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. బీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
డిసెంబర్ 13 నుండి ప్రారంభమయ్యే బీపీఎస్సీ ఈ పరీక్షలకు ఒక పూట- ఒక పేపర్ ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.