కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు శుక్రవారం శంభూ సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతులు శంభూ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతుల ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రతగా అంబాలా జిల్లాలోని 10 గ్రామల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.
వ్యవసాయ సంస్కరణల ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబాలా రైతులు ఆందోళన చేస్తున్నారు.