- 29-30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
- రాష్ట్ర వ్యాప్తంగా 112 సెంటర్లు
- పరీక్షకు హజరుకానున్న 2లక్షల 53వేల మంది విద్యార్థులు
- అమలులో ఒక నిమిషం అలస్యం నిబంధన
- ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీజీఈఎపిసెట్ -2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం అవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం సెషన్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలు మే 2 నుండి 4 వ తేదీ వరకు నిర్వహంచనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షలకు ఈ నెల 22 నుండి హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం సెషన్ 7 గంటల 30 నిమిషాల నుండి, మధ్యాహ్నం సెషన్ 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షల సమయంలో ఒక్క నిమిషం నిబంధన అమలు లో ఉంటుందని జెఎన్‌టియు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని తెలిపారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ కోసం 2 లక్షల 19 వేల 420 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీకి 86 వేల 101 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు కలిపి 2 లక్షల 53 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను 16 జోన్లుగా విభజించారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కోసం మొత్తం 112 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ పరీక్షల కొరకు మొత్తం 124 సెంటర్ల ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జెఎన్‌టియు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే సెంటర్లను పర్యవేక్షించామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.