Friday, November 22, 2024
spot_img

ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Must Read

రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని కోరారు. రాష్ట్రంలోని 02 లక్షల 50 వేలకు పై చిలుకు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణకు కృషి చేస్తామని తెలిపారు. రాజస్థాన్ , ఛత్తీస్‎గఢ్ , హిమాచల్‎ప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వాగ్ధానం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం హర్షనీయమన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులుగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పెరి విజయ్ భాస్కర్, కోశాధికారి గా మారం లింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా లెక్కల వీరేశం, మంగ నర్సింహులు, భూలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపెందర్, అసోసియేట్ అధ్యక్షులుగా శిరందాసు రామదాసు, సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి, శోభన్, శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS