- బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్.ఎస్.యూ.ఐ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు
- నిజామాబాద్ జిల్లా నుండి అనేకమంది మంత్రులు అయ్యారు.
- సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన, ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి
- క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాల్లో కష్టపడితే ఏ పదవైన వస్తుందని, అందుకు నిదర్శనం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సంధర్బంగా శుక్రవారం నిజామాబాద్ లోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు సురేష్ షెట్కార్ , అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ విద్యార్థి విభాగం ( ఎన్.ఎస్.యూ.ఐ ) నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగరని అన్నారు.
కొంతమందికి రాజకీయాల్లో అవకాశాలు ఎవరైనా ఇస్తే వస్తాయి, కానీ కష్టపడితే ఏ పదవైన వస్తుందని, అందుకు నిదర్శనం పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన, ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగేరేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బిడ్డకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి దక్కిందని, జిల్లా నుండి అనేక మంది మంత్రులు అయ్యారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు బలాన్ని ఇచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ లో ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీ జెండా ఎగురవేయాలన్నారు.