- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గత ఇదేళ్ల వైసీపీ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అయిన మాట్లాడుతూ, 2019లో దురదృష్టవశాత్తు నేరస్తులు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. క్రిమినల్ మైండ్సెట్ తో ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరని వ్యాఖ్యనించారు. నేరం చేసిన వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామని పేర్కొన్నారు.
రఘురామరాజును గత పాలకులు మానసికంగా హింసించరాని విమర్శించారు. సొంతపార్టీ ఎంపీని కూడా దారుణంగా హింసించిన చరిత్ర గత పాలకులదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా అయిన ఈ వ్యాఖ్యలు చేశారు.