Monday, April 14, 2025
spot_img

సర్కారు సెలవులిచ్చింది..

Must Read
  • ప‌ట్టించుకోని విద్యాసంస్థల నిర్వాహకులు
  • ఇంటర్ బోర్డువి ఉట్టి మాటలే యథేచ్ఛగా ఇంటర్ క్లాసులు
  • ఫిర్యాదులు చేస్తే డోంట్ కేర్ అంటున్న బోర్డు అధికారులు
  • పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం
  • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
  • పాఠశాల పున:ప్రారంభం తేదీ జూన్ 12వ తేదీ వరకు
  • సమ్మర్ హాలిడేస్ : 46 రోజులు.
  • ఏప్రిల్ 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు
  • కళాశాలలు పున: ప్రారంభం జూన్ 2 వ తేదీ
  • అయినప్ప‌టికి కొన‌సాగ‌తున్న విద్యాలయాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో స్కూళ్లకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. అయితే, ఈసారి స్కూళ్లకు మరింత ముందుగానే సెలవులు ఇస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో స్కూళ్లకు, కాలేజీలకు వేసవి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులకు సంబంధించి స్పష్టత ఇచ్చింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని చెప్పింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని.. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో పాఠశాల విద్యార్థులకు మొత్తం 46రోజులు వేసవి సెలవులు రానున్నాయి.

కానీ ఇప్పటికే పలు విద్యా సంస్థలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపుతో నడపబడుతున్న విద్యా సంస్థలు తమ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పరీక్షలు పూర్తయినప్పటికీ తదుపరి విద్యా సవంత్సరం క్లాసులు ముందుగానే నిర్వహిస్తున్నాయి.. పుస్తకాలు, బట్టలు ఇలా అన్నీ తల్లిదండ్రులు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చి… వచ్చే ఏడాది ఫీజులు కూడా ఇప్పుడే వసులు చేస్తున్నాయి..ఈ పద్దతి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది.. ఇది ఒకటి రెండు స్కూల్స్ పరిమితమైన అంశంకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ విద్యాసంస్థలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.. ప్రభుత్వం సెలవులపై స్పష్టత ఇచ్చిన విద్యా సంస్థల నిర్వాహకులు మాత్రం లెక్కచేయడంలేదు..

ఇక ప్రభుత్వం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలల వేసవి సెలవుల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంటర్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అన్ని కాలేజీలు ఈ ఉత్తర్వులను తప్పక పాటించాలని, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కానీ ఇంటర్ బోర్డువి ఉట్టి మాటలే అని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ కళాశాలలు యథేచ్ఛగా క్లాసులు నడిపిస్తుంటే ఇంటర్ బోర్డు ప్రేక్షక పాత్ర వహించడంపై విద్యార్థులు,విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఈ అంశంపై కనీసం ప్రభుత్వమైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు..

Latest News

రాజ్యాధికార సాధననే బీసీలకు అంతిమ లక్ష్యం కావాలి

ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం.. అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS