Tuesday, April 15, 2025
spot_img

ప్రతి ఏటా పెరుగుతున్న పెళ్లి కాని ప్రసాద్ లు

Must Read
  • 35ఏళ్లు దాటినా పెండ్లి సంబంధాలు కుదరక కళ్యాణ ఘడియ కోసం ఎదురుచూపులు
  • ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు చెందిన వారే..!
  • రైతుకు పిల్లనిచ్చేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే బాగుండు

ఇదో విచిత్ర సమస్య.. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం విచిత్రం. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఈ సంఖ్య వికారాబాద్ జిల్లాలో వందల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదువు, ఉన్నతోద్యోగం కారణంగా కొద్ది మంది పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు.ఇక రైతు కుటుంబాల్లోని యువకులు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటే పిల్లనివ్వడానికి ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు గల కారణాలు పరిశీలించినట్లైతే అందులో
మొదటిది:- వ్యవసాయ పొలం ఉండాలి కాని వ్యవసాయం చేయకూడదు.
రెండవది:- ఏదైనా వృత్తిలో స్థిరపడాలి కానీ స్థిరాస్తి గా భూమి ఉండాలి.
మూడవది:- ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ వ్యవసాయ భూమి ఉండాలి.

ఇలా పలు రకాల కారణాల చేత సమయానికి పెళ్ళిళ్ళు కుదరక ఏజ్ బారై పోతున్న యువకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 30 ఏళ్లు పైబడి 40 ఏళ్లు ఉండి వివాహాలు కానీ యువకులు జిల్లాలోని ఎక్కువ గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉంటారు.ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం యువకులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. రైతు కుటుంబానికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాకపోవడం ఒకింత బాధాకరమే. రైతు కుటుంబానికి పిల్లనిచ్చి పెళ్లి చేసేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశ పెడితే బాగుండు.

గతంలో ఇలా ఉండేది…
గతంలో అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పెళ్లి ఖరారు చేసే వారు. ఇప్పుడు అమ్మాయిలు ‘ఊ’ అంటేనే పెళ్లి చూపులు, అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే వివాహం. ప్రస్తుతం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయిలు ఆస్తి పరుడేనా, ప్రొఫెషనల్‌ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిలు చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, ప్రైవేటు రంగాల్లో ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులకు పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి మరీ కష్టమవుతోంది. ఎంత ఆస్తి ఉన్నా పల్లెటూరులో తమ అమ్మాయి ఉండటం కష్టమని అమ్మాయి తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. ఎవరైనా అబ్బాయికి సంబంధం వస్తే అబ్బాయి ఒక్కడే ఉన్నాడా, అతనికి అక్కాచెల్లెళ్లు ఉన్నారా అంటూ విచారణ చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది సంబంధాలు చూసే పెద్దమనుషులు ఉండేవారు.ఇప్పుడు కాలం మారిపోయింది.

Latest News

పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం

క్రికెటర్లకు తప్పిన ముప్పు వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS